Good news : వినియోగదారులకు శుభవార్త…కొత్త పంట రాకతో తగ్గిన కూరగాయల ధరలు

కూరగాయల వినియోగదారులకు శుభవార్త. కొత్త పంట రాకతో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన కూరగాయల ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం పడింది. కానీ డిసెంబరు మొదటి వారంలో పలు ఆకుకూరలతోపాటు కూరగాయల ధరలు తగ్గాయి.....

Good news : వినియోగదారులకు శుభవార్త…కొత్త పంట రాకతో తగ్గిన కూరగాయల ధరలు

vegetables

Good news : కూరగాయల వినియోగదారులకు శుభవార్త. కొత్త పంట రాకతో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన కూరగాయల ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం పడింది. కానీ డిసెంబరు మొదటి వారంలో పలు ఆకుకూరలతోపాటు కూరగాయల ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలోని కూరగాయల మార్కెట్లు,రైతుబజార్లలో కూరగాయల ధరలు సామాన్యులు, మధ్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చాయి.

ALSO READ : Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

గత వారం కిలో టమాట ధర 30 రూపాయలు పలకగా, ప్రస్తుతం కొత్త పంట రాకతో వీటి ధర 15 రూపాయలకు తగ్గింది. మార్కెట్లలో గత వారం ఉల్లి ధరలు మండిపోయాయి. గత 10 రోజుల క్రితం వరకు క్యాబేజీ ధరలు 30రూపాయల ధర పలికాయి. నేడు ఒక్క క్యాబేజీ ధర 11రూపాయలకు తగ్గింది. 40రూపాయల ధర పలికిన కిలో వంకాయలు నేడు 18 రూపాయలకు తగ్గింది. క్యాలీఫ్లవర్ ధరలు కూడా తగ్గిపోయాయి. 50 రూపాయలకు పైగా విక్రయించిన పచ్చిమిర్చి ధర తాజాగా దిగివచ్చింది.

ALSO READ : Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్‌పై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్

60 రూపాయలకు పైగా పలికిన బెండకాయ ధరలు కూడా తగ్గాయి. కాకరకాయ ధర కూడా గణనీయంగా తగ్గింది. యాభై రూపాయలకు పైగా పలికిన పలు కూరగాయల ధరలు కిలో 30రూపాయలకు తగ్గాయి. గత వారం వరకు మండిపోయిన కొత్తిమీర, పుదీనా, పాలకూర ధరలు నేడు దిగి వచ్చాయి. ఉల్లిగడ్డ ధరలు కూడా తగ్గాయి. మునక్కాయల రేట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులోకి రావడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.