Puri Jagannath Temple: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మూడు తలుపులు..
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి రహస్య గది తలుపు..
- Harishth Thanniru
- Published On : July 14, 2024 / 02:08 PM IST
puri temple ratna bhandar opened
puri temple ratna bhandar opened : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. రత్నభండార్ లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.
