Puri Jagannath Temple: సొరంగ మార్గం నుంచి రహస్య గది.. అందులో వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు?
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రత్నభాండాగారంలోని మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు వంటివి ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు. రత్నభాండాగారంలో సంపద లెక్కగట్టలేనంత భారీగా ఉందని చెబుతున్నారు. అసలు మూడో గదిని ఎందుకు తెరవట్లేరని సందేహాలు వస్తున్నాయి.
- T Venkateshwarlu
- Published On : August 30, 2022 / 09:28 AM IST
Puri Jagannath Temple
Puri Jagannath Temple: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రత్నభాండాగారంలోని మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు వంటివి ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు. రత్నభాండాగారంలో సంపద లెక్కగట్టలేనంత భారీగా ఉందని చెబుతున్నారు. అసలు మూడో గదిని ఎందుకు తెరవట్లేరని సందేహాలు వస్తున్నాయి.
నిజానికి 1926లోేనే బ్రిటిష్ పాలకులు ఆ రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారు. అందులో 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నాయని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో పేర్కొన్నారు. ఈ వివరానలు ఇటీవలే ఓ చరిత్రకారుడు మీడియాకు తెలిపారు. రహస్యగదికి కింది భాగంలోనే సొరంగమార్గం ఉందని చెప్పారు. అంతేగాక, దాని కింద కూడా మరిన్ని గదులు ఉన్నాయని తెలిపారు.
భూగర్భంలో ఉన్న ఆ గదులకు కొన్నేళ్ళ క్రితం నిపుణులు వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని అన్నారు. 12వ శతాబ్దం మొదలు 18వ శతాబ్దం వరకు ఉత్కళను పరిపాలించిన 46 మంది రాజులు ఈ సంపదను రహస్య గదుల్లో దాచినట్లు తెలిపారు. ఆ రాజులు అందరూ పురుషోత్తముడి భక్తులని చెప్పారు. ఆ రాజులు స్వామివారి కోసమే ఆ సంపదను దాచినట్లు వివరించారు.
