3rd Day Bharat Jodo Yatra
3rd Day Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులు కలిశారు. ఆ యూట్యూబ్ ఛానెల్ కు 18 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులతో రాహుల్ గాంధీ భోజనం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులు సాంప్రదాయ వంటలు చేస్తుంటారు. వారు కన్యాకుమారిలోనే ఉంటారు.
తమ ప్రాంతం మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుండడంతో వారు ఆయన వద్దకు వెళ్ళారు. రాహుల్ తో కలిసి నడుస్తూ ముచ్చటించారు. గతంలో తాము కలిసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్ట తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీని బలపర్చడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు.
గత ఏడాది ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులతో రాహుల్
Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు