Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు

 హైదరాబాద్ లో గణేశ్​ నిమజ్జనం వేళ రోడ్లపై రద్దీ పెరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పలు మార్గాల్లో వాహనాలను మళ్ళిస్తున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్ళడానికి ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్​ మెట్రో రైళ్లను ఇవాళ అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు నడుపుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఇవాళ హైదరాబాద్‌ లో ఉన్న రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నట్లు చెప్పారు.

Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ లో గణేశ్​ నిమజ్జనం వేళ రోడ్లపై రద్దీ పెరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పలు మార్గాల్లో వాహనాలను మళ్ళిస్తున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్ళడానికి ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్​ మెట్రో రైళ్లను ఇవాళ అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు నడుపుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఇవాళ హైదరాబాద్‌ లో ఉన్న రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నట్లు చెప్పారు.

మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక చివరి మెట్రో రైలు ఒంటి గంటకు బయలుదేరుతుంది. ఆయా మెట్రోస్టేషన్ల మీదుగా ప్రయాణించి దాదాపు 2 గంటల సమయంలో చివరి స్టేషన్ కు చేరుకుంటుంది. అంటే ఆయా స్టేషన్లలో చివరి మెట్రో సేవలు 1 నుంచి 2 గంటల మధ్య అందుతాయి. మళ్ళీ శనివారం ఉదయం 6గంటల నుంచి మెట్రో రైలు సేవలు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

Rahul Gandhi: మీరు కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారా..? మీడియా ప్రశ్నకు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ..