Rahul Gandhi says Congress will form govt in Hindi belt states
Congress Hope: భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతోషంతో ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందనను చూస్తుంటే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. రాహుల్ పైవిధంగా స్పందించారు.
Bihar: మహిళలకు విద్య లేదు, పురుషులకు పట్టింపు లేదు.. జనాభా నియంత్రణపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు
ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మేం (కాంగ్రెస్) ముందుకు కూడా కదలలేమని అంటున్నారు. కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి మాకు మంచి స్పందన వస్తోంది. ఈ రాష్ట్రాల్లో మేం తొందరలోనే అధికారం సాధిస్తాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Akhilesh Yadav: పోలీసులు ఇచ్చిన టీ తాగని అఖిలేష్ యాదవ్.. విషం కలిపారేమో అంటూ అనుమానం
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మొదట మాకు కేరళలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే, అక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి ఆ రాష్ట్రం బీజేపీ పాలనలో ఉంది. దక్షిణాదిలో అద్భుతంగా సాగింది. కానీ మహారాష్ట్రలో మేం అడుగుపెట్టినప్పుడు ఆ స్థాయి స్పందన రాకపోవచ్చని మేము అనుకున్నాం. కానీ దక్షిణాది కంటే ఎక్కువ స్పందన వచ్చింది. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ వచ్చింది. హర్యానాలోనూ కనిపిస్తోంది’’ అని అన్నారు. ఇది తమకు రాబోయే ఎన్నికల్లో అధికారంగా మారుతుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.