Rahul Gandhi: రైలులో ప్రయాణించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రయాణికులతో చిట్ చాట్

రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్ సహా ఇతర నేతలు రైలులో ప్రయాణించారు. షెడ్యూల్ ప్రకారం, రాహుల్ గాంధీ ఎక్కిన రైలు రాయ్‌పూర్‌కు సాయంత్రం 5:45 గంటలకు చేరుకుంది.

Rahul Tain Journey: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం రైలులో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో రాహుల్ మాట్లాడుతున్న ఫొటోలను కాంగ్రెస పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ ఎన్నికల కోసం ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ నుంచి ఒక ఫొటో షేర్ చేశారు. అందులో.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు రాహుల్ గాంధీ వెళ్తున్నారని రాసుకొచ్చారు. ఆయనను ‘జననాయక్’ అని సంబోధించారు. అదే సమయంలో, వార్తా సంస్థ ANI పోస్ట్ చేసిన వీడియోలో, రాహుల్ గాంధీ రైలులోని స్లీపర్ క్లాస్ బోగీలో ప్రయాణీకుల మధ్య కనిపించారు. ఈ వీడియలో ఆయన ప్రజల నుంచి శుభాకాంక్షలు స్వీకరించడమే కాకుండా, కొంతమందితో సెల్ఫీలు తీసుకున్నారు.


వార్తా సంస్థ PTI ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ గృహ న్యాయ సదస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ సోమవారం (సెప్టెంబర్ 25) బిలాస్‌పూర్ జిల్లాలోని తఖత్‌పూర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పర్సదా గ్రామానికి వచ్చారు. అక్కడ ఒక సమావేశంలో ప్రసంగించారు. అనంతరం బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రాయ్‌పూర్ వెళ్లేందుకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు.

రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్ సహా ఇతర నేతలు రైలులో ప్రయాణించారు. షెడ్యూల్ ప్రకారం, రాహుల్ గాంధీ ఎక్కిన రైలు రాయ్‌పూర్‌కు సాయంత్రం 5:45 గంటలకు చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు