కూలీలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయండి : రాహుల్ డిమాండ్

  • Publish Date - March 26, 2020 / 05:42 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. రోజు వారీ కూలీల విషయం ఏంటీ ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వెంటనే వారికి ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే..విపరీత పరిస్థితులు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అలాగే సంక్షోభ సమయంలో…నష్టాలను నివారించడానికి కష్టపడుతున్న పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఆర్థిక సహాయ విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిననున్నట్లు, పన్ను రాయితీలు కల్పించాలని, ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వ్యాధి ప్రబలకుండా విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని, పట్టణ ప్రాంతాల్లో  అత్యవసర స్థితిలో తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు. 

భారత దేశంలో కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం గమనార్హం. తొలుత 2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూను (14 గంటలు) పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు స్వచ్చందంగా ఈ బంద్ పాటించారు.
 

కానీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, పలువురు మృతి చెందుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 రోజుల పాటు దేశ మొత్తం లాక్ డౌన్ లో ఉండాలని ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వైరస్ విజృంభిస్తోంది. అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు రికార్డవుతున్నాయి. తర్వాత కేరళ రాష్ట్రం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే సీన్ నెలకొంది. 
 

Also Read | లాక్ డౌన్ పీరియడ్ లో ఈ పాసులుంటే ఫ్రీ ఎంట్రీ