×
Ad

ముక్కు పోయింది.. లవ్ మ్యారేజ్‌ చేసుకున్నది ఒకడు, ముక్కు పోగొట్టుకున్నది ఇంకొకడు..

ప్రతీకారంగా యువకుడి తరఫు బంధువులు యువతి మామపై దాడి చేసి అతడి కాలు విరగ్గొట్టారు. ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.

Representative Image

Rajasthan: ఓ యువకుడు లవ్‌ మ్యారేజ్ చేసుకుని అమ్మాయితో హాయిగా జీవిస్తున్నాడు. ఆ యువకుడి అన్నను అమ్మాయి తరఫు బంధువులు పట్టుకుని అతడి ముక్కును కోసేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటుచేసుకుంది.

మొదట అమ్మాయి తరఫు బంధువులు పదునైన ఆయుధంతో అబ్బాయి పెద్దన్న ముక్కును కోసేశారు. ప్రతీకారంగా యువకుడి తరఫు బంధువులు యువతి మామపై దాడి చేసి అతడి కాలు విరగ్గొట్టారు. ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. (Rajasthan)

ఈ ఘర్షణకు కారణం శ్రవణ్ సింగ్ (25) అనే యువకుడు. తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లిచేసుకున్నాడు. వారి వివాహాన్ని అమ్మాయి కుటుంబం అంగీకరించలేదు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read: 7 Layer Holograms: లిక్కర్ బాటిల్స్‌కి ‘Z+ సెక్యూరిటీ’.. అర్థం కావట్లేదా? ఏం చేస్తున్నారో చూడండి..

శ్రవణ్ సింగ్ ప్రస్తుతం తన భార్యతో కలిసి గుజరాత్‌లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం శ్రవణ్ పెద్దన్న యూకే సింగ్ (35) పొలాల నుంచి తిరిగి వస్తుండగా అమ్మాయి మామ ధర్మ్ సింగ్ (50) అతడి సహచరులతో కలిసి దాడి చేశాడు.

వారు పదునైన ఆయుధంతో యూకే సింగ్ ముక్కును కోశారు. రక్తస్రావం జరిగినప్పటికీ యూకే సింగ్ ఇంటికి చేరగలిగాడు. ఆగ్రహంతో యూకే సింగ్ కుటుంబ సభ్యులు.. అమ్మాయి ఇంటి వద్దకు వెళ్లి ధర్మ్ సింగ్‌పై దాడి చేసి అతడి కాలు విరగ్గొట్టారు.

ప్రస్తుతం యూకే సింగ్‌ సాంచోర్‌లో, ధర్మ్ సింగ్‌ను జోధ్‌పూర్‌లో చికిత్స పొందుతున్నారు. గుడామలానీ పోలీస్ స్టేషన్ డీఎస్పీ, సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, రెండు పక్షాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.