Rajasthan Theft Case: చోరీకి వెళ్లి.. ఆమ్లెట్స్ వేసుకొని తిన్న దొంగలు.. చివరికి పోలీసులు సైతం షాక్
రాజస్థాన్(Rajasthan Theft Case)లోని ఝలావడ్ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన, విచిత్రమైన ఘటన వెలుగు చూసింది.
- V Santhosh Kumar
- Published on- August 2, 2026 / 11:20 AM IST
Rajasthan thieves cook omelettes and steal valuables from house
- విచిత్ర దొంగతనం చేసిన ముఠా
- ఆమ్లెట్లు తిని నగలు దోపిడీ
- కేసు నమోదు చేసిన పోలీసులు
Rajasthan Theft Case: సాధారణంగా దొంగలు ఎవరైనా ఇంట్లో పడితే ఎక్కడ పట్టుబడతామో అనే భయంతో క్షణాల్లో దొరికినకాడికి దోచుకుని పరారవుతుంటారు. కానీ, రాజస్థాన్‌లోని ఝలావడ్ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన, విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఆ ఇంట్లోని యజమాని హర్‌జీత్ సింగ్(Rajasthan Theft Case) తన క్యాన్సర్ చికిత్స నిమిత్తం కుటుంబసమేతంగా ముంబైకి వెళ్లినట్లు దొంగలు గమనించారు. ఇల్లు ఖాళీగా ఉండటంతో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, తమ పని ముగించుకోవడంలో ఏమాత్రం హడావుడి పడలేదు. ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా వంటగదిలోకి వెళ్లిన ఆ దొంగలు, తమ వింత ప్రవర్తనతో పోలీసులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు.
TTD Hundi Record: శ్రీవారి చరిత్రలోనే సరికొత్త రికార్డు.. ఒక్క నెలలోనే రూ. 140 కోట్ల హుండీ ఆదాయం
కడుపునిండా తిని.. నగలు, నగదు, టీవీతో పరార్!
ఇంట్లోకి ప్రవేశించిన దొంగలకు కిచెన్‌లో గుడ్లు కనిపంచడంతో, ఏకంగా డజనుకు పైగా గుడ్లతో హాయిగా ఆమ్లెట్లు వేసుకొని కడుపునిండా తిన్నారు. ఆ తర్వాత నిదానంగా ఇల్లంతా వెతికి లభించిన విలువైన బంగారు నగలు, నగదుతో పాటు ఓ ఖరీదైన టీవీని కూడా తీసుకెళ్లారు. ఉదయాన్నే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వంటగదిలోని పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. బాధితుడు హర్‌జీత్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ వింత చోరీకి పాల్పడిన నిందితుల కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
