వెడ్డింగ్ కార్డుపై ఇన్విటేషన్ లింక్..విందు డోర్ డెలివరీ..పెళ్లిని లైవ్ లో చూడండీ..ఆశీర్వదించండీ..

  • Publish Date - November 25, 2020 / 04:38 PM IST

Rajasthan : wedding live streaming link on card : కరోనాకు ముందు కరోనా తరువాత రోజులు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం జరిగే పెళ్లిళ్ల పరిస్థితి చూస్తుంటే. ఈ కరోనా పరిస్థితుల్లో పెళ్లిళ్ల తీరుతెన్నులు మారిపోయాయి. పెను మార్పులతో చిత్ర విచిత్రంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ కాలంలో జరుగుతున్న విచిత్రమైన పెళ్లిళ్ల గురించి తెలిస్తే ఔరా..కరోనా ఎంత పనిచేస్తున్నావ్..జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని కూడా ఇలా ఊహించలేనంత మార్పుల్ని చేసేస్తున్నావ్ అనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో ఇటువంటి పెళ్లే జరిగింది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});
https://10tv.in/japan-fights-coronavirus-in-luxurious-style-with-million-yen-masks/
కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం పెళ్లికి హాజరయ్యే బంధువుల సంఖ్య పరిమితమయ్యింది. పెళ్లికి వందమందికి మించి బంధువులు, స్నేహితులను పిలిచే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ పట్టణాలో విభిన్న రీతులలో వివాహాలు జరుగుతున్నాయి. బంధువులందరినీ ఒకే రోజు పిలవకుండా వివిధ రోజుల్లో వారిని ఆహ్వానిస్తూ పెళ్లి తంతు కానిస్తున్నారు. పెళ్లి కార్డులోనే వివిధ రోజుల్లో వివిధ పెళ్లి తంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇక పెళ్ళి రోజు వచ్చేసరికి దానిని లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. వివాహానికి హాజరుకాలేనివారంతా లైవ్‌లో దానిని చూడండీ..ఆశీర్వదించండీ అని కోరుతున్నారు. దీంతో ప్రయాణాలతో అలసిపోనక్కర్లేదు..డబ్బులు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. పెళ్లికొచ్చాం మాకు మర్యాదలు చేయలేదని నిందలు పడక్కర్లేదు. అలగనీ అక్కర్లేదు. ఎంచక్కా..ఇంట్లో కూర్చొనే పెళ్లి వేడుకల్ని చూడొచ్చు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇందుకోసం పెళ్లి కార్డులోనే ఈ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన లింక్ కూడా ప్రింట్ చేస్తున్నారు. అలాగే బంధువులందరితో కూడిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అలాగే పెళ్లి విందు పార్సిళ్లను బంధువులు, స్నేహితులు ఇళ్లకు డోర్ డెలివరీ చేస్తున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ విధమైన పెళ్లి వేడుకలకు ప్రస్తుతం ఎంతో ఆదరణ దక్కుతున్నదని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. ఇలా కరోనా కాలంలో కొత్త కొత్త రకాలుగా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఎవరి క్రియేటివిటీని వాళ్లు వాడుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అదండీ కరోనాకాలంలో జరిగే పెళ్లిళ్లు పరిస్థితి. ఆలోచించి చూస్తే ఇవికూడా బాగానే ఉన్నాయి. మార్పు మంచిదే అన్నట్లుగా..మీరేమంటారు..

ట్రెండింగ్ వార్తలు