దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేసి రెండేళ్లు అయ్యింది. అదిగో పార్టీ, ఇదిగో జెండా.. తలైవా వచ్చేస్తున్నాడు అంటూ ప్రచారాలు మాత్రం జోరుగానే సాగాయి. ఇంతలోనే బీజేపిలోకి తలైవా వస్తారంటూ కొంతకాలంగా తమిళనాడులో వార్తలు వ్యాపించాయి.
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రిపొన్ రాధాకృష్ణన్ బీజేపీలోకి రజినీకాంత్ రావాలంటూ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన రజినీకాంత్ బీజేపీతో కలిస్తే బాగుంటుందంటూ ఆ పార్టీ పలుమార్లు అతనిని ఆకర్షించేందుకు ప్రయాత్నాలు చేసింది.
దీంతో లేటెస్ట్‌గా రజినీకాంత్ ఓ కార్యక్రమానికి హాజరై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బీజేపీలో చేరుతారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బీజేపీ ట్రాప్‌లో “తిరువళ్లూవర్ చిక్కుకోరు.. నేను చిక్కుకోను” అంటూ సమాధానం ఇచ్చారు.
ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లూవర్ విగ్రహాన్ని తంజావూరు జిల్లాలో నవంబర్ 4న కొందరు అపవిత్రం చేశారు.తిరువళ్లూవర్ విగ్రహం ముఖం మీద దుండగులు సిరా, ఆవు పేడను పూశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. అయితే ఈ ఘటనను బీజేపీ ఖండించింది. ఈ ఘటనను ఉదహరిస్తూ.. బీజేపీ చేరట్లేదనే విషయాన్ని వెల్లడించారు రజినీకాంత్.