Randeep Surjewala: నోరుజారిన కాంగ్రెస్ నేత.. సీతాదేవీకి బదులు ద్రౌపది పేరుతో..

సీనియర్ కాంగ్రెస్ లీడర్ రణదీప్ సుర్జేవాలా నోరుజారారు. ద్రౌపదికి బదులు మహాభారాన్ని సీతాదేవికి ఆపాదించారు. ప్రజాస్వామ్య సంస్థలను, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం అప్రతిష్టపాలు చేస్తుందని విమర్శించారు సుర్జేవాలా.

Congress

Randeep Surjewala: సీనియర్ కాంగ్రెస్ లీడర్ రణదీప్ సుర్జేవాలా నోరుజారారు. ద్రౌపదికి బదులు మహాభారాన్ని సీతాదేవికి ఆపాదించారు.

ప్రజాస్వామ్య సంస్థలను, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం అప్రతిష్టపాలు చేస్తుందని విమర్శించారు సుర్జేవాలా. అటువంటి సంస్థల ప్రాముఖ్యతను కేంద్రం చెరిపిస్తోందని సీనియర్ నాయకుడు పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. సత్యం, ప్రజాస్వామ్యం, న్యాయం లాంటి నియమాలే గెలిపించాయి. బీజేపీ ప్రజస్వామ్యానికి వస్త్రాపహరణం చేస్తుంది. సీతాదేవీకి చేసినట్లు. కానీ, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది. వాళ్ల ముసుగులు తొలగిపోతాయి” అని మీడియా సమావేశంలో సర్జేవాలా అననారు.

Read Also: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త కమిటీలు

నిజానికి ద్రౌపదికి బదులు.. సీతాదేవి పేరును ప్రస్తావించారు. పాండవులు, యావత్ సభ సమక్షంలో అవమానించిన ఉదంతాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లకు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.