Rajasthan: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్‭ దారుణ హత్య.. వీడియో చూస్తే షాక్ అవుతారు

పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ వెలుగులోకి వచ్చారు. పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు.

రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి వచ్చి మరీ ఆయన మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుఖ్‌దేవ్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఈ సంఘటన తర్వాత జైపూర్ నగరం తీవ్ర ఉద్రిక్తతలోకి వెళ్లింది. మరొకవైపు నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర మార్గాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం జైపూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలోని గోగమేడి ఇంటి దగ్గర ఆయన మీద దాడి జరిగినట్లు చెబుతున్నారు. సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు, ఇతరులు ఆసుపత్రికి వస్తున్నారు. అయితే ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ఘటన తర్వాత నగరంలో వాతావరణం చెడిపోకుండా పోలీసు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో నగరమంతా కలకలం రేపుతోంది.

సోషల్ మీడియా ద్వారా ఈ వార్త మరింత వైరల్ అవుతోంది. ఆనంద్‌పాల్‌ ఎన్‌కౌంటర్‌ కేసు తర్వాత గోగమేడి తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆనందపాల్ మృతదేహానికి సంబంధించి చాలా రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత గోగమేడి పేరు చాలా చర్చలోకి వచ్చింది. పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి వెలుగులోకి వచ్చారు.

పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దానిపై నిరసన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా చిత్రనిర్మాత చిత్రం పేరును పద్మావత్‌గా మార్చవలసి వచ్చింది. దాని నుంచి అనేక సన్నివేశాలను కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి రాజ్‌పుత్ సమాజంలో యువతలో చాలా ప్రసిద్ధి గాంచారు. సుఖ్‌దేవ్ సింగ్ 2018 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అది సఫలం కాలేదు. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సుఖ్‌దేవ్ సింగ్ గొడవలు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు