Nawaz Modi : భర్తతో విడిపోతున్న నవాజ్ మోడీ ఎవరు? ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు
గౌతమ్ సింఘానియా, నవాజ్ మోడీ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కాగా.. ఎవరీ నవాజ్ మోడీ?
- Lakshmi 10tv
- Published On : November 14, 2023 / 04:42 PM IST
Nawaz Modi
Nawaz Modi : రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా, భార్య ప్రముఖ రచయిత్రి నవాజ్ మోడీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఎవరీ నవాజ్ మోడీ? వీరి మధ్య బ్రేకప్‌కి కారణం ఏంటి?
Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్
ఇటీవల కాలంలో ఏ రంగంలో చూసినా సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. మనస్పర్థల కారణంతో వివాహ బంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నారు. 32 సంవత్సరాల వైవాహిక బంధం నుంచి వేరు పడుతున్నట్లు రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాము విడిపోతున్నా తమ కూతుళ్లు నిహారిక, నిసాలకు మాత్రం ఏది మంచిదో అదే చేస్తామని గౌతమ్ సింఘానియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము 32 సంవత్సరాల వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా కొనసాగించామని.. మనస్పర్థల కారణంగా విడిపోతున్నామని.. ఇకపై తమ దారులు వేరని గౌతమ్ తన పోస్టులో రాసారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించమని.. ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడేవరకు సహకరించాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేశారు.
Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు
నవాజ్ మోడీ, గౌతమ్ సింఘానియా 1999 లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు నిహారిక-నిసా. నవాజ్ మోడీ ఒక ప్రొఫెషనల్ ఫిట్ నెస్ ట్రైనర్. ఆమెకు ముంబయిలో ఫిట్ నెస్ సెంటర్ ఉంది. న్యూ యాక్టివిటీ స్కూల్‌లో చదువుకున్న ఆమె ముంబయి సెయింట్ జేవియర్స్ కాలేజీల్ ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకున్నారు. నవాజ్ మోడీ ఇటీవల ‘పాజ్, రివైండ్ : నేచురల్ యాంటీ ఏజింగ్ టెక్నిక్స్’ అనే పుస్తకాన్ని రాశారు. 53 ఏళ్ల నవాజ్ మోడీ ‘లా’ కూడా చదువుకున్నారు. ఆమె తండ్రి నాడార్ మోడీ ప్రముఖ లాయర్. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల వార్త వైరల్ అవుతోంది.
— Gautam Singhania (@SinghaniaGautam) November 13, 2023
