RBI Repo Rate : వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. హోమ్‌లోన్ ఈఎంఐలు కట్టేవారికి ఊరట

RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేట్లలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచింది.

RBI governor Sanjay Malhotra

  • ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్
  • వడ్డీరేట్లు మరోసారి యధాతథం
  • 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడి

RBI Repo Rate : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేట్లలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచింది.

Also Read : Iran vs Israel War : ఇరాన్ 10 షరతులు ఇవే.. ట్రంప్ అంగీకరిస్తారా.. యుద్ధం పూర్తిగా ఆగినట్లేనా..!

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. ఈ సమీక్షలో ఈసారికూడా రెపో రేటులో ఎలాంటి మార్పులేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ నిర్ణయం మధ్య తరగతి ప్రజలకు, ముఖ్యంగా హోమ్‌లోన్ ఈఎంఐలు కట్టేవారికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఆర్బీఐ తన రెపో రేటును మార్చలేదు కాబట్టి, బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తక్కువగా ఉంటుంది. దీని వల్ల హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి యధాతథంగా కొనసాగుతాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన గత సమావేశంలో కూడా ఆర్బీఐ రేట్లను 5.25శాతం వద్డే ఉంచింది. అంతకుముందు 25 బేసిన్ పాయింట్ల వరకు కోత విధించినప్పటికీ ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ మేఘాల నేఫథ్యంలో రేట్లను మార్చకుండా వేచి చూసే ధోరణిని ఆర్బీఐ అవలంభించింది.

ఆర్‌బిఐ ఎంపిసి సమావేశం: ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఏమన్నారంటే..
♦ భారతదేశ స్థూల ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా మార్చిలో పరిస్థితులు సవాలుగా మారాయి.
♦ ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రపంచ వృద్ధి ప్రమాదాలను ఎదుర్కొంటోంది.
♦ సంఘర్షణ కారణంగా నెలకొన్న అనిశ్చితి ఆర్థిక దృక్పథంపై భారం మోపుతోంది.
♦ ఈక్విటీలు బోర్డు ఆధారిత దిద్దుబాటును నమోదు చేశాయి.
♦ యుద్ధ ప్రమాదాల నేపథ్యంలో 2027 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.9 శాతానికి తగ్గుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది.
♦ త్రైమాసికాల వారీగా అంచనాలను చూస్తే.. మొదటి త్రైమాసికంలో 6.8శాతం, రెండవ త్రైమాసికంలో 6.7శాతం, మూడవ త్రైమాసికంలో 7శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.2శాతం.
♦ భారతదేశ విదేశీ మారక నిల్వలు 697.1 బిలియన్ డాలర్ల వద్ద పటిష్టంగా ఉన్నాయి.
♦ ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో భారతదేశ వస్తు ఎగుమతులు (గత ఏడాదితో పోలిస్తే) 0.2శాతం తగ్గాయి.