Re-registration of Vehicles : కేంద్రం భారీ షాక్-ఏప్రిల్1 నుంచి పెరగనున్న రీ-రిజిష్ట్రేషన్ చార్జీలు

15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది.

Re-registration of Vehicles  :  15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి రీ రిజిష్ట్రేన్ కు 8 రెట్లు ఫీజు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి రూ.1,000 వసూలు చేయనున్నారు. కార్లకు రూ.600కు బదులుగా రూ.5,000 వసూలు చేస్తారు. దిగుమతి చేసుకున్న కార్లకు రూ.15,000కు బదులుగా రూ.40,000 వసూలు చేస్తారు.

15 ఏళ్ల రిజిస్ట్రేషన్‌ గడువు దాటిన వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఆలస్యమైతే వారి వద్ద నుంచి నెలకు రూ.300 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. వాణిజ్య వాహనాలకు నెలకు రూ.500 వసూలు చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి రీ-రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోవటం​ ఆలస్యం అయితే రోజుకు రూ.50 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు.

అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాతబడిన ద్విచక్ర వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనున్నారు. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్​​ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.

Also Read : Brother Anil Kumar : జగన్‌కు షాకివ్వనున్న బావ అనిల్ ?

వాణిజ్య వాహనాలకు ఎనిమిదేళ్లు దాటితే ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. రీ-రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చార్జీల పెంపుతో వాహనాల యజమానులు తమ పాత వాహనాలను తుక్కుకింద తరలించేందుకు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో 1.2 కోట్ల వాహనాలు తక్కు కింద మార్చదగినవి ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. తుక్కు కింద మార్చేందుకు వాహనాలను ఇవ్వడానికి సిద్ధమయ్యే ప్రక్రియను సులభతరం చేయటానికి ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంచింది. తుక్కుకింద తమ వాహనాలు ఇచ్చే యజమానులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు