Brother Anil Kumar : జగన్‌కు షాకివ్వనున్న బావ అనిల్ ?

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బావ అనిల్‌కుమార్‌ షాకివ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Brother Anil Kumar : జగన్‌కు షాకివ్వనున్న బావ అనిల్ ?

Brother Anil Ys Jagan

Brother Anil Kumar :  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బావ అనిల్‌కుమార్‌ షాకివ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది.

గత ఎన్నికల్లో జగన్ విజయానికి కృషి చేసిన షర్మిల, అనిల్‌.. ఈసారి రివర్స్ అయినట్లే కనపడుతోంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌.. దీనికి బలం చేకూరుస్తున్నాయి. బీసీని సీఎం చేస్తే మద్దతిస్తామని చెప్పడం ఇప్పుడు హాట్‌ టాపిగ్గా మారింది.

కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే కొత్త పార్టీ కోసం పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. సోమవారం మార్చి3న ఆయన వైజాగ్‌లో పర్యటించారు. ఓ హోటల్‌లో క్రైస్తవ సంఘాలతో సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయ పార్టీ పెడతారని జోరుగా ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్రదర్ అనిల్ కుమార్ మొదటిసారిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఇటీవల భేటీ కావడం రాజకీయ కారణాలేనని చెప్పక తప్పదు. ఉండవల్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ మర్యాదపూర్వకంగానే అని చెప్తున్నప్పటికీ.. అప్పటి వ్యవహారశైలి తెలిసిన వాళ్లంతా రాజకీయాల కోసమే అని చెప్పుకుంటున్నారు.
Also Read : Russia-Ukraine War : నాటో దేశాలను టార్గెట్ చేసిన పుతిన్.. అమెరికా లక్ష్యంగా కవ్వింపు చర్యలు!
బద్రర్ అనిల్ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత విజయవాడలో బీసీ, మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. వాళ్లు.. సొంతపార్టీ పెట్టాలని అండగా ఉంటామని బ్రదర్‌ అనిల్‌ను కోరారు. అయితే అప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండానే బ్రదర్ అనిల్ వెళ్లిపోయారని తెలిసింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెళ్లిపోయారని తెలిసింది.

ఇదే టైంలో బ్రదర్‌ అనిల్ చేసిన కామెంట్స్‌.. హాట్ టాపిక్‌గా మారాయి. బీసీని సీఎం చేయాలన్న కుల సంఘాల డిమాండ్‌కు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలని.. మాట ఇస్తే మొహం చాటేసే వ్యక్తిని కాదని చెప్పారు.
Also Read : LIC IPO : మరింత ఆలస్యం కానున్న ఎల్ఐసీ ఐపీఓ
సీఎం జగన్‌ను రెండున్నరేళ్ల క్రితం కలిశానని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల బాధలు సీఎంకు వివరిస్తామన్నారు. జగన్‌ను కలిసేందుకు తనకు అపాయింట్‌మెంట్ అవసరం లేదని.. ఎప్పుడైనా వెళ్లి సమావేశం కాగలనని ప్రకటించారు. ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని బ్రదర్ అనిల్ చెప్పినప్పటికీ.. లోలోపల ఏదో వ్యవహారం జరుగుతోందని అర్థమవుతోంది.