LIC IPO : మరింత ఆలస్యం కానున్న ఎల్ఐసీ ఐపీఓ

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్‌ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్‌, రష్యా వార్‌ ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూపై పడింది.

LIC IPO : మరింత ఆలస్యం కానున్న ఎల్ఐసీ ఐపీఓ

LIC IPO

LIC IPO :  ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్‌ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్‌, రష్యా వార్‌ ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూపై పడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఐపీఓకు పనులన్నీ పూర్తి చేయగా.. ఇప్పుడీ వార్‌ టెంపరరీగా బ్రేక్ వేసింది. ప్రపంచ మార్కెట్లన్నీ షేక్ అవుతుండడంతో.. పరిస్థితులు కంట్రోల్‌లోకి వచ్చేదాకా ఆగడమే బెటరని భావిస్తోంది కేంద్రం.

యుక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌ LIC IPOపై పడింది. ఈ పబ్లిక్‌ ఇష్యూపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. సేఫ్‌ లాంచింగ్‌ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఆగే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది. దీంతో రిస్క్‌ తీసుకోవడం సరికాదని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఆగనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే LIC- IPO తెచ్చేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్ట్ ఆఫ్ ఇండియా.. సెబీకి దరఖాస్తు చేసుకోగా.. ఇందుకు ఆమోదం కూడా లభించింది. తేదీని ప్రకటించకపోయినా.. మార్చిలో ఐపీఓ ఫిక్స్​అని అనుకుంటున్న సమయంలోనే.. రష్యా, యుక్రెయిన్​ యుద్ధం రూపంలో అనుకోని సమస్య వచ్చి పడింది.

రష్యా-యుక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ వస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడిప్పుడే కొంత కోటుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయనేది అర్ధం కాకుండా ఉంది.
Also Read : Vellampalli Warns Pawan : మేము నోరు తెరిస్తే.. బయట తిరగలేరు- పవన్‌కు మంత్రి వార్నింగ్
ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నెలలో ఎల్‌ఐసీని ఐపీఓకు తెచ్చే ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. చిన్న మదుపరులు దూరంగా ఉంటున్న సమయంలో ఐపీఓకు రావడంపై చాలామంది ఫండ్​ మేనేజర్లు, ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ ఐపీఓను వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెబీ ఇచ్చిన అనుమతులు మే12వరకు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఆ లోపు ఐపీఓకు రాకపోతే మళ్లీ ఐపీఓకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.