Vellampalli Warns Pawan : మేము నోరు తెరిస్తే.. బయట తిరగలేరు- పవన్‌కు మంత్రి వార్నింగ్

2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. తన మీదే తనకి నమ్మకం లేదు. అలాంటి వ్యక్తి ప్రజలకి ఎలా నమ్మకం కలిగిస్తాడు?(Vellampalli Warns Pawan)

Vellampalli Warns Pawan : మేము నోరు తెరిస్తే.. బయట తిరగలేరు- పవన్‌కు మంత్రి వార్నింగ్

Vellampalli Warns Pawan (1)

Vellampalli Warns Pawan : వైసీపీ ప్రభుత్వం, మంత్రులు, సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. మంత్రి పేర్నినాని పవన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. అది జనసేన పార్టీ ఆవిర్భావ సభ కాదు అమ్ముడుపోయే సభ అని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్.. సభలో ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతాడని జనసేన కార్యకర్తలు అనుకున్నారు. కానీ, చంద్రబాబుని పొగుడుతూ సీఎం జగన్ ని, మంత్రులను తిడుతూ తిట్ల పురాణం మొదలు పెట్టడంతో జనసేన కార్యకర్తలు విసిగిపోయారు అని మంత్రి అన్నారు.(Vellampalli Warns Pawan)

”జనసేన పార్టీకు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే తిరుగుతాడంట.. పవన్ కళ్యాణ్ నీకు సిగ్గులేదా? అని మంత్రి అడిగారు. 2014లో చంద్రబాబుకి మద్దతిచ్చిన పవన్.. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఓట్లు పక్కాగా పోతాయని తెలిసీ జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేశాడు. రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయావు. సిగ్గుండాలి నీకు. మళ్లీ చంద్రబాబుతో కలిసి దోస్తీ చేసేందుకే జనసేన ఆవిర్భావ సభను పవన్ కళ్యాణ్ ని ఏర్పాటు చేశాడు. పవన్ కళ్యాణ్ 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ముందు పవన్ కి తన మీద తనకి నమ్మకం లేదు. అలాంటి వ్యక్తి ప్రజలకి ఎలా నమ్మకం కలిగిస్తాడు” అని మంత్రి వెల్లంపల్లి అన్నారు.(Vellampalli Warns Pawan)

Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

”పవన్ కళ్యాణ్ నిరుత్సాహంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చంద్రబాబుతో పొత్తులున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు కూల్చేశారు.
అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అప్పుడు దేవాలయాలు గుర్తు రాలేదా? గోదావరి పుష్కరాలు సమయంలో 30 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు స్పందించలేదు? బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు జైశ్రీరామ్ అంటాడు. బీజేపీతో పొత్తు లేనప్పుడు బైబిల్ అంటాడు. సినిమాల్లో ఏ విధంగా నటిస్తాడో రాజకీయాల్లో కూడా ఏ పార్టీతో పొత్తులు ఉంటే ఆ పార్టీ భజన చేస్తూ ఉంటాడు.(Vellampalli Warns Pawan)

Perni Nani On Pawan : పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని చూస్తున్నారు-పేర్నినాని

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకు చర్చిలు, మసీదులు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. వేలం పాటలో బేరం పెట్టుకునేందుకు పవన్ ఈ సభ నిర్వహించాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి లేదు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో ఫాంహౌస్ లో కూర్చొని మందు తాగే నీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయి. హైదరాబాద్ లో కూర్చుని ఉంటే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి. నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తే మేమూ వ్యక్తిగత విమర్శలు చేస్తాం. మేము నోరు విప్పితే ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేవు. బయట తిరగలేరు” అని పవన్ పై ఫైర్ అయ్యారు మంత్రి వెల్లంపల్లి.