Perni Nani On Pawan : పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని చూస్తున్నారు-పేర్నినాని

రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం. పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని...(Perni Nani On Pawan)

Perni Nani On Pawan : పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని చూస్తున్నారు-పేర్నినాని

Perni Nani On Pawan

Perni Nani On Pawan : వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. పవన్ పై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటం సభలో ఏపీ, తెలంగాణ నేతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన పవన్ పై పేర్నినాని సెటైర్లు వేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అన్నారు. చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్ ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ బాగుండాలనేదే పవన్ ఆకాంక్ష అని, పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని మంత్రి అన్నారు.(Perni Nani On Pawan)

ఇవాళ సభలో పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే… కంఠం పవన్ ది, భావం చంద్రబాబుది అన్నట్టుగా ఉందని పేర్నినాని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే పవన్, చంద్రబాబు లక్ష్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ ఒక్క మాట కూడా అనలేదన్నారు. పవన్ ను నడిపించే శక్తి బీజేపీనే అని, అలా కాకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తుంటే ప్రశ్నించాలి కదా అని మంత్రి అడిగారు.(Perni Nani On Pawan)

Nagababu : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలి : నాగబాబు

కులాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్… ఇవాళ వైసీపీలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది కమ్మ ఓటర్లు, ఎంతమంది సానుభూతిపరులు ఉన్నారో గమనించాలని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని ఇప్పుడే అనిపించిందా? అని పవన్ ను నిలదీశారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయ ఊసరవెల్లిగా అభివర్ణించారు పేర్నినాని. కమ్మవాళ్లను వైసీపీకి ఎందుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ ను నిలదీశారాయన.

”వైసీపీ కార్యకర్తలకు నమస్కారం పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నమస్కారం. పవన్ ఎప్పుడు తమ పార్టీలో దూకుతారని టీడీపీ నేతలు చూస్తున్నారు. జీవితం ప్రసాదించిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం. టీడీపీ బాగుపడాలనేది ఆయన ఆకాంక్ష. పవన్ తన వ్యాఖ్యలతో మానసిక అత్యాచారం చేస్తున్నారు. సీఎం జగన్ వినాశనమే పవన్ ఆకాంక్ష’ అని మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. ఆద్యంతం వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ పాలన అశుభంతో ప్రారంభమైందని అన్నారు. ఎవరైనా కొత్తింట్లోకి వెళితే కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించి శుభం కోరుకుంటామని తెలిపారు. కానీ, వైసీపీ వచ్చీ రావడంతోనే కూల్చివేతతో మొదలుపెట్టిందని, అశుభంతో ప్రారంభించిందని విమర్శించారు.

Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

వైసీపీ నేతలపై తనకేమీ వ్యక్తిగత ద్వేషాలు ఉండవని, వారి విధానాలపైనే తన పోరు అని పవన్ స్పష్టం చేశారు. 151 సీట్లు గెలిస్తే ఎంత బాగా పరిపాలిస్తారోనని ఆసక్తిగా చూశానని, కానీ ఇసుక పాలసీతోనే వారి నైజం బట్టబయలైందని అన్నారు. ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల 32 నిండు ప్రాణాలు బలయ్యాయని వాపోయారు పవన్.