జమ్ముకశ్మీర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పుడే దేశ సేవల కోసం ఉవ్విళ్లూరిపోతున్నారు. పాకిస్థాన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నతర్వాత అభినందన్ మిలటరీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మానసికంగా..శారీరకంగా ఒత్తిడికి గురైన అభినందన్ రెస్ట్ తీసుకుంటున్నారు. విమానం నుంచి కిందకు దూకిన సమయంలో, స్థానికుల దాడిలో అభి వెన్నెముకకు, పక్కటెముకలకు స్వల్ప గాయాలు తగిలాయంటున్నారు. మరికొన్ని రోజులు ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెబుతున్నారు.
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు
వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెబుతుంటే.. అభినందన్ మాత్రం.. తనకు త్వరగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే.. విధుల్లో చేరతానని అంటున్నారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారులు తెలిపారు. అతని కమిట్‌మెంట్‌కు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అభినందన్‌లో దేశభక్తికి ఇది నిదర్శనమని.. మళ్లీ ఉరకలేసే ఉత్సాహంతో విమానం నడిపేందుకు సిద్ధమైన వింగ్ కమాండర్‌ను ప్రశంసిస్తున్నారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం
3 రోజుల క్రితం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను తరుముకుంటూ అభినందన్ మిగ్ 21 విమానంలో వెళ్లారు. విమానం క్రాష్ కావడంతో పాక్ భూభాగంలో ప్యారాచూట్ సాయంతో దిగారు. అక్కడ పాక్ ఆర్మీ అభినందన్‌ను బందీ చేసింది. భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను భారత్‌కు అప్పగించటం.. ఆయన రాకను దేశ వ్యాప్తంగా ప్రజలంతా పండుగలా జరుపుకోవటం తెలిసిందే. తిరిగి దేశ సేవ కోసం అభినందన్ వర్థమాన్ ఆతృత పడటంతో హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్