×
Ad

Corona Cases : దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు, 446 మరణాలు

దేశంలో కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 446 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

  • Published On : October 31, 2021 / 01:47 PM IST

India Corona

new corona cases in india : దేశంలో కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 446 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 3,42,73,300 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 4,58,186 మరణాలు నమోదు అయ్యాయి.

కరోనా యక్టీవ్ కేసులు 247 రోజుల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,59,272 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.46 శాతంగా ఉన్నాయి.

Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

దేశంలో కరోన రికవరీ రేటు 98.20 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 14,667 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,36,55,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మార్చి 2020 తరువాత భారీగా రికవరీ కేసుల శాతం పెరిగింది.