Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

పండగల సీజన్ సమీపిస్తుండడంతోపాటు డెల్టా ప్లస్‌ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది.

Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

Corona Restrictions

Delta Plus variant cases : పండగల సీజన్ సమీపిస్తుండడంతో పాటు డెల్టా ప్లస్‌ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28న జారీ చేసిన నిబంధనలు ఎల్లుండితో ముగియనుండడంతో వాటిని మరోసారి పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు తగ్గినట్లు తగ్గి మరో రోజు పెరుగుతున్నాయి. మరోవైపు, బ్రిటన్, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు ఇండియాలోనూ నమోదవుతున్నాయి. ఏవై.4.2 రకం వైరస్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలలకు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

Chennai NGT : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రణాలికలు సిద్ధం చేస్తోంది. వ్యాక్సినేషన్లో వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచనుంది.