స్మార్ట్ ఫోన్ తయారీకి రిలయన్స్‌తో 4.5 బిలియన్ డాలర్ల (రూ.33వేల 645కోట్లు) పెట్టుబడులకు అల్ఫాబెట్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఇండస్ట్రీగా రికార్డు సాధించింది. రిలయన్స్ బాస్ ముఖేశ్ అంబానీ ఈ భాగస్వామ్యాన్ని గత వారం జరిగిన సంవత్సరం చివరి మీటింగ్ లో ప్రకటించారు.
గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)ను తక్కువ రేటులో 4Gలేదా 5G స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ చైనా కాంట్రాక్టర్లకు చాలెంజింగ్ గా మారనుంది. షియోమీ, రియల్ మీ ఓనర్ బీబీకే ఎలక్ట్రానిక్స్, ఒప్పో, వీవో బ్రాండ్స్ లను టార్గెట్ చేసుకుని లాంచ్ కానుంది. ఇవన్నీ కలిసి ప్రస్తుతం ఇండియాలో 2 బిలియన్ల మార్కెట్ ను దాటిపోయాయి.
బాలీవుడ్, క్రికెట్ లాంటి మార్కెటింగ్, ప్రొడక్ట్ ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ కెమెరాలతో దేశంలోని 10 స్మార్ట్ ఫోన్లలో 8చైనా కంపెనీలకు చెందినవే. ‘చరిత్రలో ఇలాంటివి ఏం జరిగినా రిలయన్స్ ఇతర బ్రాండ్లను కట్ చేస్తుంది. ఇది నిజంగా లో ఎండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ప్రశ్నార్థకమైంది అని టెక్ రీసెర్చర్ కెనాలైస్ రుషుబ్ దోషి అన్నారు.
రిలయన్స్ 2017లో ఇలాంటి ప్లాన్ నే చేసింది. జియో ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలతో మొదలుపెట్టింది. ప్రస్తుతం 100మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. ఈ పోటీని తట్టుకునేందుకు చైనా కంపెనీలు ధర తగ్గించుకుని మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి ధీటుగా గూగుల్-జియో ఫోన్ పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.