జియో కస్టమర్లకు గుడ్ న్యూస్: 30 నిమిషాల ఫ్రీ టాక్ టైమ్

ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్ప్పిన రెండ్రోజుల్లోనే జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీఛార్జి చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ‘ఎకనమిక్ టైమ్స్’ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

ఖాతాదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో జియో 30నిమిషాల టాక్ టైమ్ ఇవ్వనుంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు చొప్పున కట్ అయ్యే రూల్ తీసుకొచ్చిన 48గంటల్లోనే ఈ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆఫర్ మొదలైన వారం రోజుల్లో రీఛార్జ్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో తెలిపింది. 
 
ఇంటర్‌కనెక్ట్ ఫీజును రద్దు చేయకుండా.. ఈ ఆఫర్ ప్రకటించడం వెనుక కారణం త్వరగా రీఛార్జ్ చేయించుకోవాలనే కావాలని జియో ఇలాంటి ఆఫర్లు ఇస్తుందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. జియో టు జియో ఉచితంగా మాట్లాడుకోవచ్చు కానీ, ఇతర నెట్ వర్క్ లతో మాట్లాడాలంటే ఎక్స్ ట్రా మనీ కట్ అవుతుందన్నమాట.