Retail Inflation: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 7.41 శాతంగా నమోదు.. ఆగష్టులో ఏడు శాతమే
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఇది ఆగష్టు నెలతో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ. దీని కారణంగా ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
- Narender Thiru
- Updated on- October 12, 2022 / 06:43 PM IST
Retail Inflation: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత ఆగష్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో 0.41 శాతం అధిక ద్రవ్యోల్బణం నమోదైంది. ఆగష్టులో 7 శాతం ద్రవ్యోల్బణం ఉండగా, సెప్టెంబర్‌లో 7.41 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది.
Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్
గత ఐదు నెలల్లో ఇంత ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఏడు కీలక రంగాల ప్రగతిని సూచించే పారిశ్రామిక ప్రగతి రేటు 0.8 శాతం తగ్గింది. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం తాజా అంచనాల్ని బుధవారం విడుదల చేసింది. ద్రవ్యోల్బణ రేటు 2-6 శాతం మాత్రమే ఉండాలన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఈసారి ద్రవ్యోల్బణం నమోదైంది. తాజా ద్రవ్యోల్బణ పెరుగుదల ఆర్బీఐపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
రెపో రేట్లు పెంచడంతోసహా ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ద్రవ్యోల్బణం కట్టడి కావడం లేదు. ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ఆహారోత్పత్తుల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతి వారిపై తీవ్ర భారం పడుతోంది.
