అమెజాన్‌తో రిలయన్స్ దోస్తీ..!

  • Publish Date - September 11, 2020 / 02:14 PM IST

Reliance Amazon Deal: భారత దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్‌తో చేతులు కలిపేందుకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌లో 20 బిలియన్ డాలర్ల వాటా అంటే సుమారుగా లక్షన్నర కోట్ల విలువైన వాటాను కొనేందుకు అమెజాన్‌ సిద్ధమైంది. అనుకున్నట్లుగా డీల్ ఓకే ఐతే RRVLలో 40 శాతం వాటా అమెజాన్‌ సొంతమవుతుంది.

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు దీటుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటున్న ముకేశ్‌ అంబానీ, దానికి తగ్గట్టుగా పావులు వ్యాపారవ్యూహాన్ని పన్నారు. అమెజాన్‌‌తో రిలయన్స్‌‌ ఒప్పందం ఖరారైతే రెండు కంపెనీలూ ప్రయోజనం పొందుతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.


అమెజాన్‌లో రిలయన్స్ పెట్టుబడుల వార్తలతో, రిలయన్స్‌ షేర్‌ వాల్యూ ఆల్‌ టైమ్ రికార్డు స్థాయికి ఎగసింది. 20 వేల కోట్ల డాలర్లకు మార్కెట్‌ క్యాప్‌ చేరి, ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ సంస్థగా రిలయన్స్ నిలిచింది.