ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం

ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

  • Publish Date - April 9, 2019 / 04:14 AM IST

ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలనూ సేకరించింది. ఈ డబ్బులో సింహభాగం ఢిల్లీలోని ఓ ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరినట్టు ఐటీశాఖ నిర్ధారించింది. బోగస్‌ బిల్లులతో రూ.242 కోట్లు కైంకర్యం చేసినట్టు తెలిపింది.
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే

281 కోట్ల స్కామ్‌ను ఐటీశాఖ గుట్టురట్టు చేసింది. మధ్యప్రదేశ్‌ కేంద్రంగా రూ.281 కోట్ల రూపాయల మేర నగదు సమీకరణ జరిగిందని, ఇందులో సింహభాగాన్ని ఢిల్లీలో ఉన్న ఓ ప్రధాన పార్టీ కేంద్ర కార్యాలయానికి బదలాయించినట్లు వెల్లడైందని ఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ పథకం ప్రకారం ఈ రాకెట్‌ సాగిందని స్పష్టం చేసింది. 20 కోట్ల రూపాయలను హవాలా ద్వారా ఢిల్లీ తుగ్లక్‌ రోడ్డులో ఉన్న ఓ సీనియర్‌ నేతకు పంపారని వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌లో రెండు రోజులుగా ఐటీశాఖ 50 చోట్ల సోదాలు జరిపింది. సీఎం కమల్ నాథ్‌కు చెందిన నివాసాలు, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 14 కోట్ల 60 లక్షల నగదు, 256 మద్యం బాటిళ్లతోపాటు కొన్ని మారణాయుధాలు పట్టుబడ్డాయి. నగదు వసూళ్లు, చెల్లింపులకు  సంబంధించి చేతి రాతతో ఉన్న డైరీలు, కంప్యూటర్‌ ఫైళ్లు, ఎక్సెల్‌ షీట్లు, హార్డ్‌ డిస్క్‌లు, పత్రాలు, పలు కంపెనీలకు సంబంధించిన వివరాలు లభ్యమైనట్టు ఐటీశాఖ తెలిపింది. ఈసీ నిబంధనలను అనుసరించి ఎక్కడా పార్టీ లేదా వ్యక్తుల పేర్లను వెల్లడించలేదు. సీఎం కమల్‌నాథ్‌ కనుసన్నల్లో నడిచినట్లు, నగదు సమీకరణ, బదలాయింపు కాంగ్రెస్‌ పార్టీకి జరిగినట్లు స్పష్టమవుతోంది.

దేశ రాజధానిలో జరిపిన సోదాల్లో తిరుగులేని సాక్ష్యాలు లభ్యమయ్యాయని ఐటీశాఖ తెలిపింది. ఓ కీలకనేత సమీప బంధువు ఇంట్లో ఇవి దొరికినట్టు స్పష్టపరిచింది. రూ.230 కోట్ల రూపాయలమేర పంపిణీలు జరిగినట్టు ఆ డైరీలో రాసుందని, బోగస్‌ బిల్లులు పెట్టి 242 కోట్ల రూపాయలను కైంకర్యం చేసినట్టు ఐటీశాఖ పరిశీలన తేలింది. పన్ను ఎగవేతకు ఆస్కారమున్న 80 నకిలీ కంపెనీల ఆధారాలూ ఉన్నాని వెల్లడించింది. ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్‌ మాజీ వ్యక్తిగత సలహాదారు రాజేంద్రకుమార్‌ మిగ్లానీ ఈ హవాలా లావాదేవీలకు సూత్రధారిగా ఉన్నట్టు ఐటీశాఖ తేల్చింది.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి