Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాజస్తాన్ రాజకీయం.. అదును చూసి హల్ చల్ చేసిన సచిన్ పైలట్‭ వర్గీయులు

‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశారని విమర్శకులు అంటున్నారు.

Sachin Pilot pro slogans raised during Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: సందర్భమేదైనా రాజస్తాన్ రాజకీయం మాత్రం అస్సలు చల్లబడట్లేదు. కాంగ్రెస్ పార్టీలో చీలిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య నువ్వా నేనా అనే పోటీ కొనసాగుతూనే ఉంది. నేతలు కాస్త నెమ్మదించినా వారి అనుచరులు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. భారత్ జోడో యాత్ర రాజస్తాన్ ఎంట్రీకి ముందు ఈ గొడవ కాస్త సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ.. తాజాగా అదే యాత్రలో మరోసారి పైకి లేచింది. రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ముందే పైలట్ అనుచరులు రెచ్చిపోయి నినాదాలు చేశారు. పైలట్‭కు జిందాబాద్‭లు కొడుతూ కాసేపు హడావుడి చేశారు.

Maharashtra: మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయం వివాదం.. పోటాపోటీగా రోడ్డేక్కిన అధికార-విపక్షాలు

రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాష్ట్రంలోని దౌసా జిల్లాలోని కలఖోలో కొనసాగుతోంది. రాహుల్ వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతలో కొంత మంది ఉన్నట్టుండి ‘హమారా సీఎం కైసా హో.. సచిన్ పైలట్ జైసా హో’ (మనం సీఎం ఎలా ఉండాలి.. సచిన్ పైలట్‭లా ఉండాలి) అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా ‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశారని విమర్శకులు అంటున్నారు.

Iran: హిజాబ్ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నందుకు ఆస్కార్ విన్నింగ్ మూవీ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్