దీపావళి : యాంటీ పొల్యూషన్ మాస్క్ లకు డిమాండ్  

  • Publish Date - October 26, 2019 / 07:48 AM IST

దీపావళి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రారంభమైపోయాయి. దక్షిణాదిలో కూడా దీపావళి రాకుండానే అప్పుడే టపాసులు సందడి వినిపిస్తోంది. టపాసుల మోత. క్రాకర్స్ కాల్చటం వల్ల వెలువడే కాలుష్యం నుంచి రక్షణగా ఆన్ లైన్ లో దీపావళి మాస్క్ లు హల్ చల్ చేస్తున్నాయి. దీవాలీ మాస్క్ లకు భారీ  డిమాండ్ వచ్చింది. దివాలీకి ముందు నుంచే క్రాకర్స్ కాల్చేస్తున్నారు. దీపావళి వేడుకలు పూర్తయ్యాక కూడా క్రాకర్స్ కాల్చటం వల్ల వెలువడిని కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉంటుందనే విషయం తెలిసిందే. 

పండుగ ఆనందమే కాదు.. ఆరోగ్యం కూడా అత్యంతం అవసరం. కాబట్టి టపాసుల కాలుష్యం నుంచి చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఆన్‌లైన్ సంస్థలు యాంటి పొల్యూషన్ మాస్క్‌లను పెట్టాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో యాంటీ పొల్యూషన్ మాస్క్‌ల అమ్మకాలులు జోరందుకున్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో కొన్ని నెలల క్రితమే మాస్క్‌లు కొనేసుకున్నారు. 

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లోకి పలు రకాల యాంటీ పొల్యూషన్ మాస్క్‌లు చక్కటి డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. అన్ని సైజుల్లోను ఇవి లభిస్తున్నాయి. ముఖ్యంగా బాడీగార్డ్ డస్ట్ అండ్ పొల్యూషన్ మాస్క్, ప్రో ఎన్-99 మాస్క్, హనీవెల్ పీఎం 2.5 ఈడీ7005 మాస్క్, ఎన్-95 మాస్క్, కేఎన్-95 ఎయిర్ పొల్యూషన్ మాస్క్‌లకు ఆన్‌లైన్‌లో భలే డిమాండ్ ఉంది. రూ.200ల నుంచి 600 నుంచి ఆపై ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని మాస్క్ లు రూ.2వేలు కూడా ఉన్నాయి. 

కాగా..పొల్యూషన్ ను నియంత్రించేందుకు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు క్రాకర్స్ కాల్చుకునే విషయంలో ఆంక్షలు విధించింది. భారీ లోహకాలున్న క్రాకర్స్ కాల్చకూడదని ఆయా రాష్ట్రాల ప్రభుత్వానికి ఆదేశించింది. ఢిల్లీ కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దివాళీ వస్తుందంటే చాలు రెండు నెలల ముందు నుంచే అక్కడి ప్రభుత్వం మాస్క్‌ల తయారీ సంస్థలకు ఆర్డర్  చేస్తుందీ అంటే అక్కడ పొల్యూషన్ ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు.  
మాస్క్‌ల పని తీరు ఇలా…
బాడీ గార్డ్ డస్ట్ అండ్ పొల్యూషన్ మాస్క్. ఆన్‌లైన్‌లో ఈ మాస్క్‌కు భాగా క్రేజ్ ఉంది. 5 లేయర్లతో  ఉండే ఈ మాస్క్ కు మంచి డిమాండ్ ఉంది. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెండో లేయర్ కార్బన్‌ను ఆక్టివేట్ చేస్తుంది. దీంతో గాలి ఫిల్టర్ అయి పీల్చుకోవడానికి సౌకర్యవతంగా ఉంటుంది. భారతదేశంలోని కాలుష్య వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ మాస్క్‌ను తయారు చేయడం విశేషమనీ..స్మార్ట్ వాల్వ్ అమర్చబడి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మరో మాస్క్ డెట్టల్ కేంబ్రిడ్జి ప్రో ఎన్-99 యాంటి పోల్యూషన్ మాస్క్. ఇతర మాస్క్‌లతో పోలిస్తే దీని ఖరీదు కాస్త ఎక్కువే. వాషబుల్ కూడా. అంటే ఉతుక్కుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.  అందుకే దీనికి అంత డిమాండ్. ఈ మాస్క్‌ను 90గంటల వరకు వాడుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎన్-99 అమ్మకాలకు మంచి డిమాండ్ ఉంది. మరోమాస్క్ హనివెల్ పీఎం2.5 కూడా జోరుగా అమ్మకాలు అవుతున్నాయి. ఇలా చాలా రకాల మాస్క్ లు మార్కెట్ లో అందుబాటు ఉన్నాయి.