తమిళనాడు : అన్నాడీఎంకే నేత శశికళతో కాంగ్రెస్ నేత విజయశాంతి భేటీ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళతో రాములమ్మ గంటకు పైగా మంతనాలు జరిపారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ లో చేరితే ఎలా ఉంటుందన్న విషయంపైనా విజయశాంతితో శశికళ చర్చించినట్టు తెలుస్తోంది. శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. జయలలిత హాస్పిటల్ లో ఉన్న సమయంలో శశికళను కలిసిన విజయశాంతి శశికళ సీఎం అయితే బాగుంటుందని వ్యాఖ్యానించం..జైలువో వున్న ఆమెను ఇప్పటికే పలుమార్లు కలిసారు. ఇటీవల ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించారు. వీరిద్దరి తాజా కలకయిక మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత తరుణంలో థర్డ్ ఫ్రంట్ వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో శశికళను విజయశాంతి మరోసారి భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది.