International Flights: అంతర్జాతీయ విమానాలు రద్దు.. ఫిబ్రవరి 28వరకూ ఇంతే

కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.మరోసారి అంతర్జాతీయ విమనాల నిషేదాన్ని ఫిబ్రవరి 28వరకూ పొడిగిస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ...

Dgca Extends Ban On Scheduled International Commercial Flights

International Flights: కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. రీసెంట్ గా బుధవారం మరోసారి అంతర్జాతీయ విమనాల నిషేదాన్ని ఫిబ్రవరి 28వరకూ పొడిగిస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించారు. అన్ని విమానాలు ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ కు అనుగుణంగా ఆపరేట్ చేస్తామని తెలిపారు.

‘ముందుగా అనుకున్నట్లే కార్గో విమాన సర్వీసులు కొనసాగుతాయి. 2021 నవంబర్ 26న అనుకున్న విమానాల రద్దును పొడిగిస్తున్నాం’ అని బుధవారం అన్నారు.
డిసెంబర్ 1న చేసిన ప్రకటనలో మరో వారంలో సర్వీసులు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ‘మాస్కు’ధరించం తప్పనిసరేం కాదు..అది వ్యక్తిగత నిర్ణయం : బీజేపీ మంత్రి

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టిస్తున్న నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తొలిసారి అంతర్జాతీయ విమాన సర్వీసులను 2020 మార్చి 23 నుంచి నిలిపేశారు. జులై 2020 న ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ తో విమానాలను నడపాలని నిర్ణయించుకున్నారు.

ఇండియాతో పాటు యూఎస్, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ పాటిస్తుంది.