Employee chat viral : ఫుల్లుగా తాగి అర్ధరాత్రి బాస్‌కి మెసేజ్ చేసిన ఉద్యోగి.. ఆ తరువాత ఏం జరిగింది?
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
- Lakshmi 10tv
- Published On : August 6, 2023 / 01:30 PM IST
Employee chat viral
Employee chat viral : బాస్ అంటే ప్రతి ఉద్యోగికి గౌరవం ఉంటుంది. వర్క్ విషయంలో తప్పు చేస్తే ఏమౌతుందే అని భయం వేస్తుంది. ఓ ఉద్యోగి ఏకంగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ బాస్‌కి మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమని మెసేజ్ చేశాడంటే?
ఓ ఆఫీస్ బాస్ తన దగ్గర పనిచేసే ఉద్యోగి నుంచి ఊహించని మెసేజ్ అందుకున్నాడు. ఉద్యోగి బాస్‌కి తాగిన మైకంలో అర్ధరాత్రి మెసేజ్ పంపాడు. సిద్ధాంత్ (@siddhantmin) అనే వ్యక్తి తన దగ్గర పని చేసే ఉద్యోగి నుంచి ఊహించని మెసేజ్ అందుకున్నాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులోని సారాంశమేమిటంటే “బాస్ నేను తాగి ఉన్నాను. మెసేజ్ చేస్తున్నాను. మీకో విషయం చెబుతాను. నన్ను మీరు నమ్మినందుకు ధన్యవాదాలు. మంచి కంపెనీ పొందడం కంటే మంచి మేనేజర్ పొందడం చాలా కష్టం. నేను అదృష్టవంతుడిని. కాబట్టి మిమ్మల్ని మీరు అభినందించుకోండి’ అని ఉంది. ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసిన సిద్ధాంత్ ‘ఎక్స్ నుంచి ఇలాంటి డ్రంక్ టెక్ట్స్ పర్వాలేదు.. కానీ మీకు ఎప్పుడైనా ఇలాంటి డ్రంక్ టెక్ట్స్‌లు వచ్చాయా? ‘ అంటూ షేర్ చేశాడు.
Starbucks : స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశం
ఈ ట్వీట్‌పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. బాస్ సిద్ధాంత్ ‘నేను పనిచేసిన అత్తుత్తమ ఫ్రంటెండ్ ఇంజనీర్లలో ఒకడు’ అని చెబుతూ అతనికి మెసేజ్ పంపిన తన ఉద్యోగిని ప్రశంసించాడు.
Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl
— Siddhant (@siddhantmin) August 4, 2023
