Stock Market
Sensex Crash Today : అంతర్జాతీయస్థాయి మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు భారతదేశ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపెడుతున్నాయి. భారీ నష్టాల్లో కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల సంపద ఇప్పటి వరకు రూ. 3.39 లక్షల కోట్ల ఆవిరైనట్లు అంచనా వేస్తున్నారు. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 75.33 వద్ద కొనసాగుతోంది. 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం ప్రారంభం కాగానే మరోసారి నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు కొనసాగాయి. గంటగంటకు కనిష్టాలకు చేరుకోవడంతో భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.
Read More : Sensex Crashes : నష్టాల్లో స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ ఓ దశలో 1000 పాయిట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో సెన్సెక్స్ 907 పాయింట్లు నష్టపోయి 58,018 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 272 పాయింట్లు దిగజారి 17 వేల 332 వద్ద కొనసాగుతోంది. దీనికంతటికీ కారణం అమెరికా ద్రవ్యోల్బణమేనని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ద్రవ్యోల్బోణం 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో వడ్డీ రేట్లను ఫెడ్ పెంచుతుందని సంకేతాలు వెలువడడంతో మార్కెట్లు నష్టాలని చవి చూశాయని వెల్లడిస్తున్నారు.
Read More : TDP MLC Ashok Babu : అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన ఉమ.. అరెస్టు చేసిన పోలీసులు
ఆసియా మార్కెట్లు సైతం ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ 30 సూచీలో ఒక్క ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రమే స్వల్ప లాభాల్లో పయనిస్తోంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్ టెల్, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకులతో పాటు కొన్ని మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్ డీఎఫ్ సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.