చంద్రయాన్ బ్రేకింగ్ : ఫుల్ వర్కింగ్‌లో ఆర్బిటర్.. చంద్రుడి సమాచారం

చంద్రయాన్-2 ప్రయోగంపై అవగాహన లేని వాళ్లు సిగ్నల్ అందుకోవడం లేదు. ప్రయోగం విఫలమైందని అనుకుంటున్నారు. కానీ, ఇది ఫెయిల్యూర్ ముమ్మాటికి కాదు. చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ ఓ సంవత్సరం పాటు తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై ఇస్రో అధికారి ఇలా మాట్లాడారు. 

‘మిషన్‌లో కేవలం 5శాతం మాత్రమే పూర్తి కాలేదు. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ దగ్గర ఆగిపోయింది. మిగిలిన 95శాతం విజయవంతంగా పూర్తి చేయగలిగాం. చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది’ అని వెల్లడించారు. 

ఆర్బిటర్ కూడా చంద్రుని ఫొటోలు తీసి ఇస్రోకు సమాచారం ఇస్తుంది. సైంటిస్ట్‌లు ఆ సమాచారం ఆధారంగా పరిస్థితుల్ని విశ్లేషించడానికి వీలు ఉంటుంది. చంద్రునిపై దిగే ల్యాండర్‌ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌ పని చేసేది కేవలం 14రోజులు మాత్రమే. మిగతా కాలం అంతా ఆర్బిటర్ ద్వారా పరిశోధన చేయాలి. చంద్రుడిపై ఉండే మట్టి, రాళ్లు, వాతావరణం వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవటానికి రోవర్ ఉపయోగపడుతుంది. చంద్రయాన్ ప్రాజెక్ట్ లో ఈ రెండు చేసే పని కేవలం 5శాతం మాత్రమే అని వివరించారు సైంటిస్టులు.

‘శనివారం రాత్రి ల్యాండర్ చంద్రునిపై దిగే ముందు సిగ్నల్ కోల్పోయింది. అంటే దానికి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు.. అక్కడి వాతావరణ పరిస్థితులకు పాడైపోయి ఉండొచ్చు. లేదంటే సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్ పంపలేకపోతుండాలి’  అని అధికారి వెల్లడించారు. ఆర్బిటర్ ఇప్పటికీ 100శాతం పని చేస్తుందని.. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి సంకేతాలు పంపిస్తున్నట్లు వెల్లడించారాయన.