బెంగళూరులోని కేఫ్‌లో పేలుడు కలకలం
ఓ బ్యాగులో పెట్టుకువచ్చిన పదార్థాలే పేలుడికి కారణమని తెలుస్తోంది.
- T Venkateshwarlu
- Updated on- March 1, 2024 / 03:19 PM IST
బెంగళూరులో పేలుడు కలకలం చెలరేగింది. రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించి పలువురికి గాయాలయ్యాయి. ఓ బ్యాగులో పెట్టుకువచ్చిన పదార్థాలే పేలుడికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు జరిగిన ప్రాంతంలో పొగ అల్లుకుంది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
పేలుడుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు కేఫ్ నుంచి పేలుడు శబ్దం వినపడిందని స్థానికులు చెబుతున్నారు. రామేశ్వరం కేఫ్‌కు ప్రతిరోజు వందల మంది కస్టమర్లు వస్తుంటారు. పేలుడు తర్వాత ఆ కేఫ్ బయట జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు.
వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారు.. అసలు విషయం తేలింది: సజ్జల
