వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారు.. అసలు విషయం తేలింది: సజ్జల

Sajjala: ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.

వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారు.. అసలు విషయం తేలింది: సజ్జల

Sajjala Ramakrishna Reddy

మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చేతిలో ఆమె పావులా మారారని, ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.

వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరని ఆయన నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజార్టీ ఆరోజు ఉందని అన్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో కలిసి సునీత పనిచేస్తున్నారని చెప్పారు. వివేకాను ఓడించింది బీటెక్ రవి కాదా? అని అన్నారు. అటువంటి చంద్రబాబు, బీటెక్ రవితో సునీత ఎందుకు కలిశారని ప్రశ్నించారు.

వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనేనని చెప్పారు. ఈ కేసుల నాలుగైదు రోజుల్లో తెలిపోవాల్సిందే అయితే చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని నిలదీశారు. ఈ విషయాన్ని చంద్రబాబును సునీత ఎందుకు అడగడం లేదని అన్నారు. ఇది రాజకీయ కుట్ర అని చెప్పారు.

వైసీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే పార్టీని వీడిన వారిని చంద్రబాబు టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. సునీత కుటుంబ సభ్యుల పాత్రపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణలో ఏడు ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు.. ఏఏ నియోజకవర్గానికి ఎవరంటే?