శరద్ పవార్‌కు పూర్తయిన ఆపరేషన్..
- vamsi
- Published On : March 31, 2021 / 07:13 AM IST
Sardh Pawar
Sharad Pawar operation:ఎన్సీపీ నేత శరద్ పవర్ కడుపు నొప్పితో రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. శరద్ పవర్‌ను పరీక్షించిన వైద్యులు పిత్తాశయంలో స్టోన్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరిక్షల అనంతరం మంగళవారం సాయంత్రం సర్జరీ చేసి పిత్తాశయంలోని స్టోన్ తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ విషయంపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి రాజేష్ తోపే మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు శరద్ పవర్ కు సర్జరీ చేశారని సర్జరీ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఇదే విషయమై డాక్టర్ అమిత్ మీడియాతో మాట్లాడారు. శరద్ పవర్ ఆసుపత్రిలో చేరగానే తాము పలు వైద్య పరీక్షలు నిర్వహించామని, వీటిలో ఆయన పిత్తాశయంలో స్టోన్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డాక్టర్ల బృందం దీనిపై చర్చించి సర్జరీ చెయ్యాలని నిర్దారణకు వచ్చినట్లు అమిత్ వివరించారు. అనుకున్నట్లుగానే మంగళవారం సర్జరీ పూర్తి చేశామని తెలిపారు.
ప్రస్తుతం పవర్ అబ్సర్వేషన్‌లో ఉన్నట్లు చెప్పిన అమిత్.. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇది మైనర్ సర్జరీనే కావడంతో రెండు రోజుల్లో పవర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, పవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని పార్టీ నేతలకు కార్యకర్తలకు చెప్పింది ఆ పార్టీ.
