మరో ప్రమాదం : బోరు బావిలో పడిన ఐదేళ్ల చిన్నారి 

  • Publish Date - November 4, 2019 / 05:07 AM IST

బోరు బావులకు చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా బోరు బావుల విషయంలో  నిర్లక్ష్యం కొనసాగుతోంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో  సుజిత్ ఘటన మరచిపోక ముందే మరో ఘోరం జరిగింది. హర్యానాలోని హారి సింగ్ పురా గ్రామంలో  బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి పడిపోయింది. చిన్నారిరి  రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యల్ని ప్రారంభించారు. కర్నాల్ లోని ఘరుదాలో హర్ సింగ్ పురా గ్రామంలో ఆదివారం (నవంబర్ 3) సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.  

ఆడుకుంటన్న ఐదు సంవత్సరాల శివాని ప్రమాదవశాత్తు  బోరుబావిలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్నారిని వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు  గుర్తించారు. శివానిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

పైపుల ద్వారా వైర్ లూప్‌ వేసి లోపలికి ఆక్సిజన్‌ పంపిస్తున్నారు. శివాని సురక్షితంగా రావాలని  తల్లిదండ్రులు, బంధువులతో పాటు..స్థానికులు కూడా కన్నీటితో భగవంతుడిని వేడుకుంటున్నారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో  4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ మృతి చెందిన విషయం తెలిసిందే.