Dog Part
Animal Brutality: జంతువులపై జరిగిన మరో హింసాత్మక ఘటన ముంబై నగరానికి షాక్ ఇచ్చింది. డిసెంబర్ 25రాత్రి మహారాష్ట్రలోని ముంబైలోని తూర్పు అంధేరీలో జరిగింది. మరో కుక్కతో కలుస్తున్న సమయంలో లైంగిక అవయవాన్ని కట్ చేశారు.
స్థానిక వ్యక్తి కుక్క పరిస్థితి చూసి బాంబే సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ యానిమల్స్ కు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించి కుక్క ప్రాణాన్ని కాపాడగలిగారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ మేరకు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ యానిమల్స్ యాక్ట్ 1960 చట్ట ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
‘ఘటన గురించి తెలియగానే కపస్వాదీ ప్రాంతానికి వెళ్లాం. విషమ పరిస్థితిలో ఉన్న కుక్కను హాస్పిటల్ కు తరలించి కాపాడాం. అని స్థానికులు చెబుతున్నారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారి మితేశ్ జైన్… సీసీటీవీ ఫుటేజి పరిశీలించి నిందితుడ్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.. ఇంతలోనే రోడ్డు ప్రమాదం