Cleric Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్
మత గురువుల ముసుగులో కొందరు నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. Cleric Kiss
- Naveen
- Updated on- July 30, 2023 / 07:24 PM IST
Cleric Kiss(Phogo : Google)
Cleric Kiss – Bihar : కొందరు మత గురువులు దారి తప్పుతున్నారు. కామంతో రగిలిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కోరిక తీర్చుకోవాలని చూస్తున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మత గురువుల ముసుగులో కొందరు నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ మతగురువు నిర్వాకం బట్టబయలైంది. అమ్మాయితో అతడి అసభ్య ప్రవర్తన కెమెరాకి చిక్కింది. అమ్మాయిని గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్ లోని సివాల్ జిల్లా అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒక మతగురువు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మతగురువు ఒక మౌల్వీ. భూతవైద్యం చేస్తాడు. భూతవైద్యం కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలు, బాలికలు అతడి దగ్గరికి వస్తుంటారు.
కాగా, మౌల్వీ దగ్గరికి ఒక విద్యార్థిని వచ్చింది. ఆమెతో మాటలు కలిపాడు మౌల్వీ. ఇంతలో అతడికి మూడ్ వచ్చిందో ఏమో కానీ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దగ్గరికి లాక్కుని పెదాలపై ముద్దు పెట్టాడు. తొలుత విద్యార్థిని దూరంగా జరిగింది. ఆ తర్వాత ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది.
విద్యార్థినితో మతగురువు అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్న సమయంలో ఎవరో చాగా ఉండి వీడియో తీశారు. అంతే, మౌల్వీ నిజస్వరూపం బట్టబయలైంది. అమ్మాయిలతో అతడు చేసే నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతగురువు తీరుపై అంతా మండిపడుతున్నారు. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన మౌల్వీని అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత మతగురువుపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
