Heart Attack In Gym : షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఆయనకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో కసరత్తులు చేస్తాడు.(Heart Attack In Gym)
- Naveen
- Published On : January 6, 2023 / 06:49 PM IST
Heart Attack In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది. ఇప్పుడు, వయసుతో సంబంధం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు.. ఫిట్ గా ఉండి, జిమ్ చేస్తున్న వారు సైతం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఆయనకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో కసరత్తులు చేస్తాడు. ఎప్పటిలాగే గురువారం కూడా జిమ్ కు వెళ్లాడు. ట్రెడ్‌మిల్ పై నడిచాడు. తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
Also Read..Heart Attack : చలికాలంలో గుండె పోటు మరణాలు అధికమా! ఎందుకిలా ?
అంతే, చూస్తుండగానే.. నేల మీద కుప్పకూలాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న కొందరు యువకులు వెంటనే ప్రదీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రదీప్ కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ట్రెడ్ మెల్ పై నడిచాక ప్రదీప్ కు చెమట్లు పట్టాయి. తన జాకెట్ తీసుకుని తుడుచుకున్నాడు. ఇంతలో అతడికి తల తిరిగినట్లు అనిపించింది. సపోర్ట్ కోసం పక్కనే ఉన్న టేబుల్ ని పట్టుకోబోయాడు. కానీ, అలాగే కుప్పకూలాడు.
ప్రదీప్ జిమ్ లో కసరత్తు చేయడం, ఆ తర్వాత కుప్పకూలి చనిపోవడం.. ఇదంతా జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. హెల్తీగా, ఫిట్ గా ఉన్నా, జిమ్ చేసే వారు సైతం ఇలా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
జిమ్‌లో గుండెపోటు..
जिम में एक और मौत।
इंदौर: होटल व्यापारी की वर्क आउट करने के दौरान दिल का दौरा पड़ा और देखते ही देखते उनकी मौत हो गई। #Indore #Gym #heartattack pic.twitter.com/3ON7v2vPKi
— Afroz Alam (@AfrozJournalist) January 5, 2023
