Singapore HC in India: ఢిల్లీ వీధుల్లో సింగపూర్ నకిలీ రిజిస్టర్డ్ కారు చక్కర్లు.. హెచ్చరించిన సింగపూర్ ఎంబసీ

దీనిపై విదేశాంగ శాఖ, పోలీసులను అప్రమత్తం చేశాం. మీరు ఈ కారును చూస్తే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు IGI (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి

నకిలీ కార్ నంబర్లకు సంబంధించి ఇండియాలోని సింగపూర్ హైకమిషన్ శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. 63 సీడీ ప్లేట్లు నకిలీవని, ఇది తమ కారు కాదంటూ కమిషన్ పేర్కొంది. సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందస్తూ.. “అలర్ట్! నంబర్ ప్లేట్ 63 CD ఉన్న ఈ కారు నకిలీది. ఇది సింగపూర్ ఎంబసీ కారు కాదు. దీనిపై విదేశాంగ శాఖ, పోలీసులను అప్రమత్తం చేశాం. మీరు ఈ కారును చూస్తే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు IGI (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి’’ అని ట్వీట్ చేశారు. కారుకు సంబంధించి రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు.