SIR Notices : జైశంకర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. VVIPలకు SIR నోటీసులు.. అసలు కారణం ఇదే!
SIR Notices : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పలువురు వీవీఐపీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఉన్నారు? అసలు నోటీసులు పంపడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- September 20, 2026 / 07:44 PM IST
SIR notices to EAM Jaishankar
- ఓటర్ల జాబితాలో వీవీఐపీల పేర్లు.. కేజ్రీవాల్ తర్వాత జైశంకర్..
- జైశంకర్, సూద్, ద్వివేదీ ఫ్యామిలీలకు ఈసీ నోటీసులు
- సర్‌లో వీవీఐపీల పేర్లు ఎందుకు? సీబీఐ డైరెక్టర్ కూడా
- జైశంకర్ దంపతులు సహా మరింత మందికి నోటీసులు
SIR Notices : ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా పలువురు వీవీఐపీ ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో ఎస్. జైశంకర్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్యకు నోటీసులు అందాయి. వీరంతా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉన్నారు.
జైశంకర్, ఆయన భార్య క్యోకో పేర్లను (Unmapped with Last SIR) కేటగిరీలో చేర్చారు. గత సర్ సమయంలోని ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలతో ప్రస్తుత ఓటరు రికార్డులను మ్యాప్ చేయలేకపోయారు. అందుకే ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. జైశంకర్ దంపతులు న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సుందర్‌బాగ్ ఎలక్టోరల్ పార్ట్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు.
‘సీబీఐ డైరెక్టర్’కు సర్ నోటీసులు :
ఇదే కారణంతో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనితా సూద్, తల్లి కమ్లేశ్ సూద్కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్య సునితా ద్వివేదీ పేర్లు కూడా గత సర్ రికార్డులతో మ్యాచ్ కాకపోవడంతో ఇదే కేటగిరీలో నోటీసులు అందుకున్నారు.
సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కుటుంబ సభ్యులకు మాత్రం వేర్వేరు కారణాలతో నోటీసులు ఇచ్చారు. ఆయన భార్య షీబా బ్రిట్టాస్ పేరులో తేడా గుర్తించడంతో (Self Name Mismatch) కింద నోటీసు ఇచ్చారు.
ఆయన కుమారుడు ఆనంద్ బ్రిట్టాస్ విషయంలో తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసం ఉండటంతో (Parent Name Mismatch) కేటగిరీలో నోటీసు జారీ చేశారు. ఇదే సర్ ప్రక్రియలో మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్ కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
కేజ్రీవాల్, ఫ్యామిలీకి నోటీసులు :
ఇక మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవిలకు కూడా (Unmapped with Last SIR) కేటగిరీలో నోటీసులు అందాయి.
అయితే, సర్ నోటీసు రావడం అంటే ఓటు హక్కు రద్దయినట్లు కాదు. ప్రస్తుత ఓటరు వివరాలను ధ్రువీకరించేందుకు అవసరమైన ఆధారాలు సమర్పించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పరిశీలన అనంతరం అర్హతకు అనుగుణంగా ఓటరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.
