Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముడు బలి
పాము కాటుకు అక్కాతమ్ముళ్ల బలైయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సాంగలీ జిల్లాలో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : October 18, 2021 / 05:18 PM IST
Snake Bite
Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముళ్ల బలైయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సాంగలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఖానాపూర్ తాలూకా ఆల్సంద్ గ్రామానికి చెందిన రైతు సునిల్ కదమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అక్టోబర్ 6న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు విరాజ్ సునిల్ కదమ్(16)ను పాము కాటేసింది. తెల్లారిన తర్వాత కుమారుడిని గమనించిన కుటుంబ సభ్యులు నోటి వెంట నురగ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చదవండి : Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని
అయితే మార్గమధ్యంలోనే విరాజ్ సునిల్ కదమ్ మృతి చెందాడు. సోదరుడి అత్యక్రియలకు హాజరైన పెద్ద అక్క సాయలీ జాదవ్(22)ను అక్టోబర్ 8న అదే పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆమె ఈ నెల 15న మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక చనిపోయిన సాయలీ జాదవ్‌కు ఏడాది పాప ఉంది.
చదవండి : Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..
