Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని

ఎలా వచ్చాయో తెలియదు కానీ ఓ ఇంటి అడుగున ఏకంగా 92 ర్యాటిల్ స్నెన్స్ తిష్ట వేశాయి. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని

Sankes In Home

Rattlesnake : భూమి మీద ఉన్న అతి ప్రమాదకర పాముల్లో ర్యాటిల్ స్నేక్ ఒకటి.. పాములు పట్టుకోవడంలో ఎంతో నైపుణ్యం ఉన్నవారు కూడా ఈ పామును చూస్తే భయపడిపోతారు. ఈ పాము కాటువేస్తే 15 నుంచి 25 నిమిషాల్లోపు వైద్యం అందాలి లేదంటే మనిషి ఔటే.. అలాంటి ప్రమాదకరమైన విషసర్పాలు ఒకే చోట గుంపుగా కనిపిస్తే.. గుండె జారినట్లు అవుతుంది.

చదవండి : Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..

వాటి గురించి తెలిసిన వారు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండరు పరుగు పెడతారు. అయితే ఎలా వచ్చాయో తెలియదు కానీ ఓ ఇంటి అడుగున ఏకంగా 92 ర్యాటిల్ స్నెన్స్ తిష్ట వేశాయి. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో కొన్ని పాములు ఎప్పుడు వచ్చాయో కానీ చక్కగా అక్కడే పిల్లలు చేశాయి. వాటి సంఖ్య సెంచరీకి చేరువైంది.

చదవండి : 2 Headed Snake : ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టమే, ఖరీదు రూ.70లక్షలు.. నమ్మారో అంతే సంగతులు

ఈ పనులు యజమాని కంటపడటంతో హడలిపోయారు. వెంటనే ఆలస్యం చేయకుండా రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నాలుగు గంటలు కష్టపడి 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటకు తీశారు. బయట ఆహారం దొరక్కపోవడంతో అవి ఇంట్లోకి వచ్చి ఇక్కడే తమ సంతతిని పెంచుకుని ఉంటాయని రెస్క్యూ టీమ్ బృందంలోని ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు.

చదవండి : Snake : వామ్మో.. వాషింగ్ మెషీన్‌లో నాగుపాము.. బట్టలు వేద్దామని డోర్‌ తెరవగా..

ఇక వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. ఇక వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు వామ్మో ఇన్ని పాములా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషసర్పాలు ఎవరికి హాని చేయకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు ఆ ఇంటిసభ్యులు