2 Headed Snake : ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టమే, ఖరీదు రూ.70లక్షలు.. నమ్మారో అంతే సంగతులు

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా చీటింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి బలహీనతలను, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా రెండు తలల పామును అడ్డు పెట్టుకుని ఓ ముఠా రంగంలోకి

10TV Telugu News

2 Headed Snake : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా చీటింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి బలహీనతలను, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా రెండు తలల పామును అడ్డు పెట్టుకుని ఓ ముఠా రంగంలోకి దిగింది. ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్తనిధులు దొరుకుతాయని నమ్మించి ఈ ముఠా అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను పట్టుకున్నారు. రెండు తలల పామును అమ్మ కానికి పెట్టిన ముఠాను అటవీశాఖ విజిలెన్స్‌ విభాగం అదుపులోకి తీసుకుంది.

Google Pay: అనుమానస్పదంగా మారిన గూగుల్ పే ప్రైవసీ

ఈసీఐఎల్‌ సమీపంలోని నాగారంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ.ఆంజనేయప్రసాద్‌తో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అది రెండు తలల పాము. బరువు నాలుగున్నర కేజీలు. రూ. 70 లక్షలకు అమ్మకానికి పెట్టారు. పోలీసులు వీరితో పాటు కారు, టూవీలర్, 4 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేడ్చల్‌ కోర్టు లో హాజరుపరిచారు.

Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!

రెండు తలల పాము గురించి అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించారు. రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్‌ సాండ్‌ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా అదృష్టం కలిసిరావటం, గుప్తనిధులు దొరకటం అనేది కేవలం అపోహేనన్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫిర్యాదు చేయాలన్నారు. రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టం అని ఎవరైనా చెబితే నమ్మొద్దని సూచించారు. అలాంటి మాటలు నమ్మినా, అత్యాశాకు పోయినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.