Google Pay: అనుమానాస్పదంగా మారిన గూగుల్ పే ప్రైవసీ

ప్రముఖ పేమెంట్స్ యాప్.. గూగుల్ పే వివాదంలో ఇరుక్కుంది. చాలా సేఫ్ అని భావిస్తూ ట్రాన్సాక్షన్లు జరుపుతున్న యూజర్లకు ఒక్కసారిగా ఈ వార్త షాక్ ఇచ్చింది.

Google Pay:  అనుమానాస్పదంగా మారిన గూగుల్ పే ప్రైవసీ

Google Pay

Google Pay: ప్రముఖ పేమెంట్స్ యాప్.. గూగుల్ పే వివాదంలో ఇరుక్కుంది. చాలా సేఫ్ అని భావిస్తూ ట్రాన్సాక్షన్లు జరుపుతున్న యూజర్లకు ఒక్కసారిగా ఈ వార్త షాక్ ఇచ్చింది. పర్మిషన్లు లేకుండా యూజర్ ఆధార్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల యూజర్ సేఫ్టీకి సమస్య వస్తుందని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేశాడు.

ఈ ప్రజాప్రయోజన వాజ్యంపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, బుధవారం యూఐడీఏఐ, ఆర్బీఐలను నిలదీసింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై నవంబర్‌ 8లోపు స్పందించాలని గూగుల్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు కూడా పంపింది. గూగుల్‌ పే టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌లో బ్యాంక్‌ అకౌంట్ వివరాలతో పాటు, ఆధార్‌ వివరాల సేకరణ గైడ్‌లైన్స్ ఉన్నాయనే సంగతి ప్రస్తావించారు. అభిజిత్‌ మిశ్రా అనే ఫైనాన్షియల్‌ ఎకానమిస్ట్‌ అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

ప్రైవేట్‌ కంపెనీగా వ్యవహరిస్తూ.. ఆధార్​, బ్యాకింగ్‌ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్‌ పర్మిషన్‌ లాంటి అధికారాలు ఉండవు. ఆర్బీఐ ఆథరైజేషన్‌ లేకుండా ట్రాన్సాక్షన్ నడిపిస్తోందని మరో పిల్‌ దాఖలు చేశారు. ఇది పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ కాదని, థర్డీ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ అని గతంలోనే కోర్టుకు ఆర్బీఐ, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ స్పష్టం చేశాయి.