మధ్యప్రదేశ్ లోని తేజాజీ నగరంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐగురుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తేజాజీ నంగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రలమండల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.
మృతుల్లో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొనటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఈ శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి పరుగెత్తారు. వెంటనే సహాయక చర్యల్ని చేపట్టారు. అనంతరం పోలీసులకు..అంబులెన్స్ కు సమాచారం అందించారు.
వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు సహాయంతో గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు..వారి పేర్లు వంటి పలు అంశాలపై దర్యాప్తు చేపట్టారు.